నేడు ఉదయం 8 గంటల నుంచి అడ్వాన్స్ బుకింగ్స్
W.G: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు SCR ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఆదివారం ఉదయం 8 గంటల నుంచి అడ్వాన్స్ టికెట్ బుకింగ్ మొదలు కానున్నాయి. ఈ రైళ్లలో ప్రయాణం చేయాలంటే తప్పనిసరిగా బుక్ చేసుకోవాలని రైల్వే శాఖ పేర్కొంది. రద్దీ నేపథ్యంలో జనవరి 8-20వరకు 41 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు.