యుద్ధం.. రోడ్లపై అనాథలుగా కుక్కలు
పశ్చిమాసియా యుద్ధ సంక్షోభంలో గుండెల్ని పిండేసే వార్తలు బయటకువస్తున్నాయి. క్షిపణి దాడుల నేపథ్యంలో ప్రాణభయంతో ప్రవాసులు స్వదేశానికి పారిపోతున్నారు. ఆ సమయంలో విమానాల్లో వెంట తీసుకెళ్లేందుకు సరైన ప్రతాలు, సమయం లేకపోవడంతో రోడ్లమీదే తమ పెంపుడు కుక్కలను అనాథలుగా వదిలివెళ్తున్నారు. దీంతో యూఏఈ దేశాల్లో రోడ్లపై దిక్కులేకుండా పెంపుడు కుక్కలు, పిల్లలు తిరుగుతున్నాయి.