పాఠశాలలో కట్లపాము.. విద్యార్థులకు తప్పిన ప్రమాదం

పాఠశాలలో కట్లపాము.. విద్యార్థులకు తప్పిన ప్రమాదం

SKLM: జలుమూరు మండలం అల్లాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కట్లపాము హల్చల్ చేసింది. ఇటీవల పాఠశాలకు సెలవులు ఇవ్వడంతో గురువారం తెరిచామని ఉపాధ్యాయుడు రామచందర్రావు తెలిపారు. పాఠశాల తెరిచి విద్యార్థులకు పాఠాలు బోధిస్తుండగా బెంచి కింద ఉన్న కట్లపామును విద్యార్థులు చూసి భయభ్రాంతులకు గురి అయ్యారని అన్నారు. తక్షణమే స్పందించి కట్లపామును చంపి వేశామని వివరించారు.