ఆరిలోవ అన్న క్యాంటీన్‌లో కమీషనర్ ఆకస్మికతనిఖీలు
VSP: జీవీఎంసీ 13వ వార్డు ఆరిలోవ కాలనీలో గల అన్న క్యాంటీన్‌ను జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మంగళవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్‌లో ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయో లేదో పరిశీలించి, భోజనాలు ఎలా అందిస్తున్నారో స్థానికులను ఆరా తీశారు.