శ్రీశైలంలో డిసెంబర్ 1 నుంచి 5 వరకు శివ దీక్ష విరమణ
NDL: శ్రీశైలంలో డిసెంబర్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కార్తీక మాస శివ దీక్ష విరమణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. భక్తుల సౌకర్యార్థం పాతాళ గంగ మార్గంలో శివదీక్ష శిబిరాలలో దీక్ష విరమణ కార్యక్రమం ఉంటుందన్నారు. అక్టోబర్ 22న శివ మండల దీక్షను నవంబర్ 11న అర్ధమండల దీక్షను స్వీకరించిన భక్తులు దీక్షను విరమించనునన్నారు.