మొదటిసారి హెలికాప్టర్లో మేడారం వచ్చిన మంత్రి సీతక్క

మొదటిసారి హెలికాప్టర్లో మేడారం వచ్చిన మంత్రి సీతక్క

MLG: మంత్రి సీతక్క మొదటిసారి హెలికాప్టర్‌లో సోమవారం మేడారంకు వచ్చారు. ములుగు నియోజకవర్గానికి మూడోసారి MLAగా.. తొలిసారి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న సీతక్క మొట్టమొదటిసారిగా హెలికాప్టర్‌లో తన ఆరాధ్య దేవతల సన్నిధికి చేరుకున్నారు. మేడారం మహా జాతరను అధికారికంగా తన చేతుల మీదుగా జరిపించడం తన జీవితాశయం అని, ఈ సారి తనకు అవకాశాన్ని కల్పించారని మంత్రి అన్నారు.