నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KMM: బోనకల్ మండల కేంద్రంలో 11 కేవీ లైన్ మరమ్మతుల కారణంగా బుధవారం, ఉదయం 8:30 గంటల నుంచి 10:30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని ఏఈ టి.మనోహర్ తెలిపారు. ఈ అంతరాయం బోనకల్ టౌన్ ఫీడర్ పరిధిలోని బోనకల్, రావినూతల గ్రామాలకు వర్తిస్తుందని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.