VIDEO: తోరణాలు కడుతూ జారిపడి వృద్ధురాలికి గాయాలు
అన్నమయ్య: తంబళ్లపల్లె మండలం రాగిమాను దిన్నెపల్లెకు చెందిన ఉత్తమ్మ (52) అనే మహిళ సోమవారం ఇంటి గుమ్మానికి తోరణాలు కడుతూ ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. కదిరి పౌర్ణమి సందర్భంగా ఉపవాస దీక్షలో ఉన్న ఆమె, నీరసంతో అదుపు తప్పి పడిపోయినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు వెంటనే 108 వాహనంలో ఆమెను తంబళ్లపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.