'చెడు వ్యసనాలకు బానిస కావొద్దు'
సూర్యాపేట: డ్రగ్స్, మద్యపానం వంటి అలవాట్లతో విద్యార్థులు జీవితాలను నాశనం చేసుకోవద్దని అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి హెచ్చరించారు. బుధవారం సూర్యాపేటలో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడుతూ.. సోషల్ మీడియా ప్రభావంతో యువత పెడదారి పట్టడం విచారకరమన్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి, లక్ష్యాలను చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు.