రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

VZM: ఏలూరు జిల్లాలో పెదవేగి మండలంలో ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కూలి పనికోసం వచ్చి సర్వీసు రోడ్డుపై నడుస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. కాగా, మృతుడు విజయనగరం జిల్లాకు చెందిన కృష్ణమూర్తిగా పోలీసులు గుర్తించారు.