ఎటువంటి పులి పిల్లలు లేదు

చిత్తూరు: గుడిపాల మండలం కనకనేరి అటవీ ప్రాంతంలో చిరుత పిల్లలు ఉన్నట్లు సోషల్ మాధ్యమాల్లో వైరల్గా మారిన వీడియో పై డిఎఫ్‌వో చైతన్యకుమార్ రెడ్డి ఆదివారం స్పందించారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన కమలేశ్ ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు, అతని స్నేహితుడు ఇంస్టాగ్రామ్ ద్వారా పంపించిన ఓ వీడియోను, మార్ఫింగ్ చేసి కనకనేరి అటవీ ప్రాంతంలో ఉన్నట్లు సోషల్ మాధ్యమాల్లో ప్రచారం చేశారన్నారు