NDA ఎంపీలకు మోదీ డిన్నర్ పార్టీ
NDA ఎంపీలకు ప్రధాని మోదీ డిన్నర్ పార్టీ ఇచ్చారు. ఈ విందు కోసం 50కి పైగా టేబుల్స్ సిద్ధం చేసి.. ప్రతి టేబుల్‌కు ఒక కేంద్రమంత్రి కూర్చొనేలా ఏర్పాటు చేశారు. ఈ విందులో పాల్గొన్న మోదీ ఎంపీలతో పలు అంశాలపై సంభాషించారు. NDA భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం, ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్లడం, శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, తదితర అంశాలపై చర్చించారు.