ఉప్పల్ స్టేడియం ఏర్పాట్లు పరిశీలించిన డిప్యూటీ సీఎం
HYD: ప్రపంచ ప్రఖ్యాత ఫుట్ బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణ ఉందని, ఆయనకు ప్రత్యేక భద్రతా వ్యవస్థ ఉంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈనెల 13న ఉప్పల్ స్టేడియంలో జరగనున్న మెస్సీ ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ ఏర్పాట్లను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పరిశీలించారు.