VIDEO: ప్రమాదకరంగా మారిన మలన్ గొంది వంతెన
ASF: ఆసిఫాబాద్ మండలం మలన్ గొంది వంతెన ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రమాదకరంగా మారిందని స్థానికులు తెలిపారు. వంతెనకు గుంత ఏర్పడి నెల రోజులు గడుస్తున్నా అధికారులు, నాయకులు ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు.