గ్రామపంచాయతీలో ఓటర్ల జాబితా ప్రదర్శన
KMR: బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా వార్డుల వారీగా తయారు చేసిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను గ్రామ పంచాయతీలో ప్రదర్శించినట్లు కార్యదర్శి సాయికుమార్ శనివారం తెలిపారు. ఓటర్ల జాబితాలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 21వ వరకు గ్రామపంచాయతీలో లిఖితపూర్వకంగా తెలపాలని ఆయన పేర్కొన్నారు.