'ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలి'
GNTR: ప్రభుత్వ పథకాల అమలుపై సోమవారం కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి కార్యాలయంలోనూ జీఎస్టీ 2.0పై అవగాహన కోసం హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలనీ, ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.