టి. సుండుపల్లి మండలంలో నీళ్ల ట్యాంక్ శుభ్రం..!
అన్నమయ్య: టి.సుండుపల్లి మండలం టీడీపీ అధ్యక్షుడు చప్పిడి రమేశ్ నాయుడు సుండుపల్లి మండల కేంద్రంలోని నీటి ట్యాంకును శుభ్రం చేయించారు. మండల కేంద్రానికి తాగునీటిని సరఫరా చేసే నీటి ట్యాంకును ఆదివారం ఆయన శుభ్రం చేయించారు. నీటి సరఫరా చేసే పైపులు ట్యాంకులు శుభ్రంగా ఉండాలని, గ్రామాలను ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.