పదవీ విరమణ.. హెడ్ కానిస్టేబుల్‌కు సన్మానం

పదవీ విరమణ.. హెడ్ కానిస్టేబుల్‌కు సన్మానం

ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో SP నితికపంత్ ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ ఆత్రం అమృతరావు పదవీ విరమణ సందర్భంగా ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం శాలువా కప్పి సత్కరించి, పోలీస్ కో-ఆపరేటివ్ సొసైటీ పొదుపు నిధుల నుంచి రూ. 2,68,568 విలువైన చెక్ అందజేశారు. 41 ఏళ్ల సేవలను గుర్తిస్తూ అమృతరావు క్రమశిక్షణ, నిజాయితీతో పనిచేసినందుకు ప్రశంసించారు.