మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట: పొంగులేటి
KMM: మహిళల ఆరోగ్యం, పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం తిరుమలాయపాలెంలో పర్యటించిన మంత్రి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో "స్వస్త్ నారీ – సశక్తి పరివార్ అభియాన్” కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం 21 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.