నేడు అమలాపురంలో ఏపీఆర్ఎస్ ప్రవేశ పరీక్ష
కోనసీమ: తుని(M) జగన్నాథగిరి ఏపీఆర్ గురుకుల పాఠశాల ప్రవేశాల కొరకు శుక్రవారం APRS క్యాట్, డీసెట్ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ గురువారం తెలిపారు. ఈ పరీక్షల కోసం అమలాపురంలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రవేశ పరీక్షను శాంతియుతంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.