VIDEO: లారీ ఢీకొని ఒకరి మృతి

Akp: మునగపాకలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన మాడా కన్నారావు (55) మృతి చెందాడు. ద్విచక్రవాహనంపై వస్తున్న ఆయనను వెనక నుంచి క్వారీ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో కన్నారావు అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణం బలైందంటూ బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.