రైతుల సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు

రైతుల సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు

KNR: రబీ సీజన్ వరి ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా పౌరసరఫరా అధికారి నర్సింగరావు తెలిపారు. రైతులు తమ ఫిర్యాదుల కోసం 9154249727 నంబరును సంప్రదించాలని కోరారు. ధాన్యం విక్రయాల్లో ఇబ్బందులు కలగకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సోమవారం ఒక ప్రకటనలో సూచించారు.