రోగులపట్ల మర్యాదగా వ్యవహరించాలి: DMHO
ELR: జిల్లా DMHO డాక్టర్ పీజే అమృతం ల్యాబ్ టెక్నీషియన్లతో సమావేశం నిర్వహించారు. బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రోగులపట్ల ప్రేమగా వ్యవహరించాలని సూచించారు. సమయపాలన కలిగి ఉండాలని, ఉత్తమసేవలు అందిస్తూ అంకితభావంతో పనిచేయాలని అన్నారు. ఆరోగ్యకేంద్రాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.