పేకాట రాయుళ్లు అరెస్టు

NLG: పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన సంఘటన శుక్రవారం రాత్రి చింతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చింతపల్లి ఎస్సై రామ్మూర్తి తెలిపిన వివరాలు ప్రకారం.. మండల పరిధిలోని వింజమూరు గ్రామంలో ఓ ఇంటిలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు దాడులు నిర్వహించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.2500 నగదు చేసుకున్నట్లు తెలిపారు.