న్యూ రాజరాజేశ్వరిపేటలో తాగునీరు కలుషితం
NTR: న్యూ రాజరాజేశ్వరిపేట ప్రాంతంలో కలుషిత తాగునీటి సమస్య తీవ్ర కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా నీరు కలుషితమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో డయేరియా ప్రబలుతున్నా నిర్లక్ష్యం వహిస్తున్నారని చెబుతున్నారు. తక్షణమే స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.