పాలకుర్తి సోమేశ్వరాలయంలో కార్తీక శోభ

పాలకుర్తి సోమేశ్వరాలయంలో కార్తీక శోభ

JN: పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక పౌర్ణమి పురస్మరించుకుని బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో,ఆలయం శివనామస్మరణంతో మార్మోగింది. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు.