VIDEO: విద్యుత్ వైర్లు తగిలి JCB డ్రైవర్ సజీవదహనం
ASR: చింతపల్లి మండలంలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. చెరువూరులో వంతెన నిర్మాణ పనులకు వెళ్తున్న JCBకి విద్యుత్ వైర్లకు తగలడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ శ్రీనివాసరాజు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. ఘటనపై స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.