హోటళ్లు, రూముల కోరత ఉంది: సీఎం

AP: పర్యాటక రంగంలో హోటళ్లు, రూముల కోరత ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. హోటల్ గదులు పెరిగితే పర్యాటకరంగం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. 50వేల గదులను అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. హోటల్ రూమ్‌ల ధరలు తక్కువగా ఉంటే పర్యాటకులు బస చేస్తారని చెప్పిన సీఎం.. అందుకోసం చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.