షరతులతో కూడిన బెయిల్.. కాకాణికి తాత్కాలిక ఊరట

NLR: కాకాణి గోవర్ధన్‌రెడ్డికి అక్రమ మైనింగ్ కేసులో హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు 75 రోజులుగా నెల్లూరు జైలులో ఉన్న ఆయనకు ఇది తాత్కాలిక ఊరటగా భావిస్తున్నారు. కోర్టు ఆయన పాస్‌పోర్ట్‌ను సమర్పించాలని, విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ మేరకు ఆయన రేపు విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. కాగా, ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.