28నుంచి నల్లపోచమ్మ అమ్మవారి జాతర

మెదక్: జిల్లాలో ఏడుపాయల జాతర ముగిసింది. కాగా, జిల్లాలో మరో పెద్ద జాతర జరగనుంది. కౌడిపల్లిలోని తునికి శ్రీనల్ల పోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న జాతర ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి పి.మోహన్ రెడ్డి తెలిపారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పటు చేసినట్లు తెలిపారు.