తిరుమలయ్య గుడిలో చోరీ: వ్యక్తి అరెస్ట్​

తిరుమలయ్య గుడిలో చోరీ: వ్యక్తి అరెస్ట్​

NZB: ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామంలోని తిరుమల ఆలయంలో చోరీకి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. ఈ మేరకు సోమవారం వివరాలు వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం తిరుమలయ్య ఆలయంలో చోరీ జరగగా, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశామన్నారు. పక్కా సమాచారం మేరకు ఇవాళ లింగపూర్ స్టేజ్ వద్ద అతడిని పట్టుకున్నామన్నారు.