ఎనుమాముల మార్కెట్ నేడు ప్రారంభం

WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు (గురువారం) ప్రారంభం కానుంది. బుధవారం మేడే సందర్భంగా మార్కెట్ బంద్ ఉండగా గురువారం ఓపెన్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కావున రైతులు ఈ విషయాన్ని గమనించి, నాణ్యమైన సరుకులు మార్కెట్‌కు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. ఉదయం 6గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.