విఘ్నేశ్వరునికి మేలుకొలుపు సేవ
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో శనివారం వైశాఖ మాసం శుద్ధ పాడ్యమి కావడంతో భక్తులు వేకువజాము నుంచి స్వామివారి దర్శనానికి పోటెత్తారు. ఆలయ అర్చకులు స్వామి వారికి మేలుకొలుపు సేవ నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. స్వామి వారిని ప్రత్యేక పూలతో అలంకరించారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు.