VIDEO: ఎస్సీ కాలనీలో ఇళ్లల్లోకి చేరిన వరద నీరు
E.G: గోపాలపురం మండలం పెద్దాపురం గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామం మొత్తం నీట మునిగింది. దీంతో పల్లపు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. గురువారం స్థానిక ఎస్సీ కాలనీలో ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో జనజీవనం స్తంభించింది. ఈ నేపథ్యంలో పిల్లలు, పెద్దలు గగ్గోలు పెడుతున్నారు. అధికారులు స్పందించి మోటార్ల సాయంతో వరద నీరుతోడాలని కోరుతున్నారు.