'9 మంది రౌడీ షీటర్లపై బైండోవర్ కేసులు నమోదు'
కాకినాడ జిల్లాలో SP బిందు మాధవ్ ఆదేశాల మేరకు జగ్గంపేట సర్కిల్ పరిధిలోని 9 మంది రౌడీ షీటర్లపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు సీఐ YRK శ్రీనివాస్ తెలిపారు. గండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదుగురు, జగ్గంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు మొత్తం 9 మందిపై ఈ కేసులు నమోదయ్యాయి. వారిని మండల మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినట్లు వెల్లడించారు.