VIDEO: రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఘన స్వాగతం
తిరుపతి జిల్లా రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం AP గవర్నర్ అబ్దుల్ నజీర్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి RDO భాను ప్రకాష్,అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.