'మాస్క్ తీయను' అన్న ప్రియాకు పరాజయం

'మాస్క్ తీయను' అన్న ప్రియాకు పరాజయం

బీహార్ ఎన్నికల్లో గెలిచేవరకు మాస్క్ తీయనని శపథం చేసిన 'ద ప్లూరల్స్' పార్టీ చీఫ్ పుష్పమ్ ప్రియా చౌదరీ ఓటమి పాలయ్యారు. దర్భంగా స్థానం నుంచి పోటీ చేసిన ఆమె, ఎనిమిదో స్థానానికి పరిమితమయ్యారు. ఇక్కడ BJP నేత సంజయ్ గెలిచారు. కులమత రాజకీయాలకు అతీతంగా కొత్త బ్రాండ్‌ను తీసుకురావాలని 2020లో ప్లూరల్స్ పార్టీని ఆమె స్థాపించారు. ప్రియా తాత నితీష్‌కు అత్యంత సన్నిహితులు.