విద్యుత్ షాక్ తో గేదె మృతి

విద్యుత్ షాక్ తో గేదె మృతి

JN: విద్యుత్ షాక్‌కు గురై ఓ గేదె అక్కడికక్కడే మృతి చెందిన ఘటన దేవరప్పుల మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. బాధితుడు ఉప్పుల అంజయ్య తెలిపిన ప్రకారం.. మేతమేసుకుంటూ వెళ్లి ఓ గాడిలో ఉన్న నీళ్లను తాగుతుండగా ప్రమాదవశాత్తు ఆ పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫర్ తగిలి మృతి చెందింది. సుమారు రూ.50 వేల నష్టం జరిగిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.