గాంధీ HYDను తొలిసారి సందర్శించింది ఈ రోజే.!
హైదరాబాద్‌లో మహాత్మా గాంధీ ఇదే రోజున ఏప్రిల్ 7, 1929న తొలిసారి పర్యటించారు. ఈ సందర్భంగా సుల్తాన్ బజార్‌లోని ఫ్రేం థియేటర్‌లో మహిళా సభను ఏర్పాటు చేశారు. అదే రోజు స్థానిక పాఠశాలలను సందర్శించారు. విద్యార్థులు, కాంగ్రెస్ కార్యకర్తలు, అంటరాని వర్గాల ప్రజలతో సమావేశాలు జరిపారు. ఆ తర్వాత 1934లో రెండవసారి వచ్చారు.