'మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

NLG: ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై దేవరకొండ ఆర్డీవో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు, నూనె రామస్వామి మాట్లాడుతూ.. వంట బకాయి బిల్లులు జీతాలు చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వ హామీలో భాగంగా రూ.10 వేల వేతనం ఇవ్వాలన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యాలను కల్పించాలని పేర్కొన్నారు.