మీకు మోకాళ్ల నొప్పులు ఉన్నాయా?
మోకాళ్ల నొప్పులు తగ్గేందుకు యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉండే ఆహారాలను తీసుకోవాలి. దీని వల్ల ఆక్సికరణ ఒత్తిడి తగ్గి మోకాళ్లపై భారాన్ని తగ్గించవచ్చు. దీంతో మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి. బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, క్యాప్సికం, చెర్రీలు, నారింజ, నిమ్మ, పాలకూర, బ్రోకలీ, చిలగడదుంపలు వంటి ఆహారాలను తింటుంటే ఉపయోగం ఉంటుంది. అలాగే, పసుపును రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి.