రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది: కలెక్టర్
ADB: రైతుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం అని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక'లో భాగంగా గురువారం మావల మండల కేంద్రంలోని రైతు వేదికలో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు.