'మధిర మార్కెట్ రోడ్డు మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి'

KMM: మధిరలోని మార్కెట్ యార్డు రోడ్డు అధ్వానంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వచ్చిన ప్రతిసారీ రోడ్డుపై గుంతల్లో నీరు నిలిచిపోవడం వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.