అడవి పందుల దాడిలో రైతు మృతి..!
MLG: అడవి పందుల దాడిలో రైతు మృతి చెందిన ఘటన ములుగు మండలంలో చోటుచేసుకుంది. దేవగిరిపట్నం గ్రామానికి చెందిన కుందురు వెంకటేశ్వర రెడ్డి(65) అనే రైతు ఇవాళ తన పంట పొలం వద్దకు వెళ్ళి, పంట పరిశీలిస్తుండగా హఠాత్తుగా అడవి పందులు అతనిపై దాడి చేశాయి. ఈ దాడిలో రైతు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.