అంగన్వాడీ టీచర్లకు శిక్షణ

MDK: తూప్రాన్ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం అంగన్వాడీ టీచర్లకు పోషన్ బి, పడాయి బి కార్యక్రమంపై శిక్షణ అందజేసినట్లు ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు శివకుమారి, వసుమతి, మెహతా తెలిపారు. పుట్టిన బిడ్డకు మొదటి ఐదు ఏళ్ల వయసు పునాది లాంటిదని వివరించారు. చిన్నారులకు సరైన ప్రేరణ, పోషణ అందించాలని సూచించారు. అందుకు గృహాల సందర్శన చేపట్టాలని పేర్కొన్నారు.