యష్ సినిమాలో రుక్మిణి వసంత్?

కన్నడ స్టార్ యష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న 'టాక్సిక్' మూవీలో నటి రుక్మిణి వసంత్ భాగం కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆమె కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. రుక్మిణితో పాటు మరో కన్నడ నటుడు బాలాజీ మనోహర్ కూడా నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇక గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 19న రిలీజ్ కానుంది. కాగా, ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.