చవితి ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ

చవితి ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ

E.G: జిల్లా ఏఎస్పీ అల్లూరి సుబ్బరాజు, సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్ బుధవారం ధవళేశ్వరం పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. వినాయక చవితి పండుగ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి సూచనలు చేశారు. రథం వీధిలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసే ఉత్సవ నిర్వాహకులతో సమావేశమయ్యారు. నిమజ్జన ఘాట్‌లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఐ టి.గణేశ్ పాల్గొన్నారు.