భారీగా గంజాయి పట్టివేత: సీఐ

భారీగా గంజాయి పట్టివేత: సీఐ

SKLM: ఇచ్చాపురం రైల్వే స్టేషన్ పరిధిలో బుధవారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు స్టేషన్ ఆవరణలో అనుమానస్పదంగా ఉన్న వ్యక్తిని తనిఖీ చేయగా అతని వద్ద 28 కేజీలు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చిన్నం నాయుడు తన కార్యాలయంలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నామన్నారు.