'వరదల్లో నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలి'

SRPT: వరదల్లో నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి పేర్ల నాగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం తుంగతుర్తిలో ఆయన మాట్లాడుతూ.. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో వరదల వల్ల పంట పొలాలు దెబ్బతిన్నాయన్నారు. అదేవిధంగా రోడ్లకు మరమ్మతులు చేయించాలన్నారు.