ముగిసిన గణపతి విగ్రహ ప్రతిష్టాపన
KNR: కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ అలుగునూర్లో స్వయంభువుగా వెలసిన శ్రీ లక్ష్మీగణపతి దేవాలయంలో సథ్వజ నవగ్రహ శ్రీ లక్ష్మీగణపతి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా ముగిసింది. వేద పండితులు పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో గత 3రోజులుగా పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గణపతి పూజ, గర్భగుడి ప్రవేశం, విగ్రహ ప్రతిష్ఠ తదితర కార్యక్రమాలను జరిపించారు.